ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదారనాథ్ శివాలయాన్ని మంచు కప్పేసింది. రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తుండడంతో శైవక్షేత్రం అంతా మంచు దుప్పటి కప్పుకుంది. హిమపాతం కురుస్తుండడంతో దేవాలయాన్ని ప్రస్తుతం మూసేశారు. 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరిచే అవకాశం ఉంది.