6 నెలలు తిహాడ్‌ జైల్లోనే కేజ్రీవాల్‌

85చూసినవారు
6 నెలలు తిహాడ్‌ జైల్లోనే కేజ్రీవాల్‌
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. ఆ గడువు ముగియడంతో జూన్‌ 2న తిరిగి లొంగిపోయారు. ఈ కేసులో జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ.. ఆయన సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైల్లో 6 నెలలు ఉండాల్సి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్