సాధారణంగా పక్క పక్క ఇళ్లలో నివసించే వారికి స్థలం విషయంలో, మురుగు నీటి కాలువలో విషయంలో గొడవలు వస్తాయి. అయితే కేరళలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరికి మాత్రం కోడి పుంజు విషయంలో గొడవ మొదలైంది. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశాంతి లేకుండా పోతోందని భావించిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఏకంగా దానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. కోడిపుంజు రోజూ తెల్లవారుజామున 3 గంటలకు కూస్తుండడంతో తన నిద్ర చెడిపోతోందని స్థానిక ఆర్డీవోకు కంప్లైంట్ ఇచ్చాడు.