పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

1054చూసినవారు
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితుడైన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్