రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

81చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన వీరంకి భిక్షం(61) అశ్వారావుపేట పేపర్ మిల్లు సమీపంలో ఉన్న ఒక దాబా హోటల్ లో పనిచేస్తున్నాడు. కోడిగుడ్లు తెచ్చేందుకు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా భిక్షాన్ని మందలపల్లి వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్