రాజకీయాలను బీజేపీ కలుషితం చేసింది: నున్నా

76చూసినవారు
రాజకీయాలను బీజేపీ కలుషితం చేసింది: నున్నా
దేశంలో రాజకీయాలను బిజెపి కలుషితం చేసిందని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 57వ డివిజన్ రమణగుట్ట ప్రాంతంలో సిపిఎం పార్టీ మహాసభ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అటు సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్