ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిద్ మహమ్మారి నిలువరించడానికి, వ్యాక్సిన్ తయారీకి వివిధ సంస్థలు సైంటిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు ప్రయోగశాల దశను దాటి టెస్టింగ్ దశక దగ్గరకు రావడం ముదావహం.
ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ ఆర్ అండ్ బి జి ఎం ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంతర్జాతీయ స్థాయి పరిశోధకులతో నేడు ఒక వెబినార్ నిర్వహించింది. "కోవిద్ 19 ఏ పాండమిక్ ఆఫ్ కరోనా వైరస్ ప్రోగ్రెస్ ఇన్ తెరపిటిక్ అండ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్" అనే అంశంపై భక్తులు తమ ప్రజెంటేషన్ సమర్పించారు.
శ్రీ నవీన్ మిట్టల్ ఐఏఎస్ కళాశాల మరియు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఈ సభకు చీఫ్ ప్యాట్రన్ గా వ్యవహరించారు. శ్రీ కె ఎస్ ఎస్ రత్న ప్రసాద్ ప్రిన్సిపాల్ గారు చైర్ పర్సన్ గా వ్యవహరించారు.జంతు శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ లు శ్రీనివాసులు , రవి శంకర్ మరియు వెంకటేశ్వరరావు కార్యక్రమ సంధానకర్తలు గా వ్యవహరించారు.
యూఎస్ఏ కేంబ్రిడ్జి ఎక్స్పాన్షన్ టెక్నాలజీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగ అధిపతి డాక్టర్ మహేందర్ బీ దేవల్ వ్యాక్సినేషన్ పై ఇంతవరకు జరిగిన పరిశోధనలు వివరించారు. సంప్రదాయక వ్యాక్సిన్ పని చేయు విధానము, ఆధునిక పద్ధతిలో వ్యాక్సిన్ తయారీ విధానం వాటి అందలి సాంకేతిక అంశాలు చక్కగా వివరించారు.వెబినార్ లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది సుదీర్ఘ ప్రక్రియ అయినప్పటికీ నిరంతర కృషితో కొన్ని సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేశాయని తెలిపారు. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ప్రాధాన్యత లేని భావన అని తెలిపారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జాగ్రత్తలు పాటించడమే ఉత్తమమని, వ్యాక్సిన్ వచ్చేవరకూ నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపారు.
దక్షిణ కొరియా ఉల్సాన్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ రవి కుమార్ చిదరాల గారు రెమిడేసివీర్ పనితీరుపై తమ ప్రజెంటేషన్ ఇచ్చారు.
జిన్ టు క్లోన్స్ వైరస్ జర్నీ అంశంపై డాక్టర్ వీర బ్రహ్మచారి ప్రసంగించారు. యూరో పిన్స్ లిమిటెడ్ యూ కె కి చెందిన డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ సైంటిస్ట్ ఎన్వి రమన్ గారు ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు వివరించారు. వెబినార్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వక్తలు వ్యాక్సిన్పై పరిశోధన లు జరుగుతున్నప్పటికీ నమ్మకం ఖచ్చితత్వం కోసం కాస్త సమయం పడుతుందని, కోవిడ్ స్పందన వ్యక్తి వ్యక్తికి వేరుగా ఉందని, అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారని వారి శ్రమకు తగ్గ ఫలితం వచ్చేవరకు నిబంధనలు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని తెలిపారు.