ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మేయర్ పూనుకొల్లు నీరజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రాపర్తి శరత్ , దండా జ్యోతి రెడ్డి అయ్యప్ప రెడ్డి, అధికారులు, సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.