తిరుమలాయపాలెం ఎస్సీ గురుకుల పాఠశాలకు అద్దె, కరెంట్ బిల్లు బకాయిల కారణంగా భవన యజమాని సోమవారం తాళం వేశాడు. ఖమ్మం పుట్టకోటలోని బొమ్మ కళాశాల భవనంలో పాఠశాల నిర్వహణ జరుగుతోంది. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బయటే వేచివున్నారు. గురుకుల పేరెంట్ అసోసియేషన్ సభ్యులు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు. జోనల్ అధికారి స్వరూప రాణి చర్చల అనంతరం తాళాలు తొలగించారని సమాచారం.