భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందు ఐదుగురు మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పుణెం పాక్లి, వెట్టి దేవ, మడకం ఉంగ్లి, రవ్వ సోమ, మడివి గంగి ఉన్నట్లు ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జనజీవన స్రవంతి ద్వారా మెరుగైన జీవితం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.