ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ కమిటీ సభ్యులు మంగళవారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.