మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం వారి కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్రంలో వర్షాల కారణంగా నిస్సహాయులుగా మారిన వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకున్నామని మిగిలిన వారికి కూడా త్వరలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.