తనకు ఓట్లు వేసి గెలిపించిన మధిర నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునే విధంగా పనిచేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతిక్షణం అంకితభావంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడానికి సంపద సృష్టించడం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కోసమే పని చేస్తానని చెప్పారు. దళితబంధు యూనిట్స్ ను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీలులేదని స్పష్టం చేశారు.