ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మడుపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట నరసింహారావు ఆధ్వర్యంలో శనివారం పాఠశాలలో పేరెంట్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నామని కావున తల్లిదండ్రులు తమ సంపూర్ణ సహకారం అందించాలని తెలిపారు.