కూసుమంచి మండలం జక్కేపల్లి ఎస్సీ కాలనీ వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఖమ్మం నుండి జక్కేపల్లికి వచ్చే బస్సు కాలనీలోకి వెళ్లి ఖమ్మం బయలుదేరుతుంది. కాలనీలోకి వచ్చాక డ్రైవర్ వెనక్కి తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి వెనుక భాగం దూసుకెళ్లింది. ఈ సమయాన ప్రయాణికులు లేకపోవటంతో ప్రమాదం తప్పింది. అనంతరం గ్రామస్తుల సహకారంతో బస్సును బయటకు తీసి బయలుదేరారు.