ఖమ్మం రూరల్ మండలం కామంచికల్-రామన్నపేట మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రహదారిపై భారీగా నీరు వచ్చి చేరుతుందని వాహనదారులు తెలిపారు. దీంతో రహదారి చెరువును తలపిస్తుందని చెప్పారు. ప్రతిరోజు ఈ రహదారిపై వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని, రోడ్డుపై నీటి నిల్వ వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు