ఇంటింటా జ్వరమే... ఆసుపత్రి కిటకిట

61చూసినవారు
ఇంటింటా జ్వరమే... ఆసుపత్రి కిటకిట
నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల వర్షాలతో పారిశుద్ధ్య సమస్య ఏర్పడడమే జ్వరాల వ్యాప్తికి కారణమని తెలుస్తోంది. నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి గత రెండు రోజులుగా 350 నుంచి 400 వరకు ఓపీలు నమోదవుతున్నాయి. చలి జ్వరం, తలనొప్పి, దగ్గు, నీరసం, నొప్పుల వంటి సమస్యలతో వస్తున్న వారితో హాస్పిటల్ కిటకిటలాడుతోంది.

సంబంధిత పోస్ట్