బూర్గంపాడ్ మండలం మోతేపట్టి నగర్లో 1 కోటి 20 లక్షల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా బీటీ రోడ్డు నిర్మాణం పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జేసీబీ నడిపారు. తదనంతరం పలువురు ఎమ్మెల్యేకు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందించారు.