వరద బాధితులకు 10 క్వింటాళ్ల బియ్యం అందజేత

71చూసినవారు
వరద బాధితులకు 10 క్వింటాళ్ల బియ్యం అందజేత
తల్లాడ మండలం నూతనకల్ గ్రామానికి చెందిన గణేషుల రవి ఖమ్మం వరద బాధితులకు 10 క్వింటాళ్ల బియ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయికి 10 క్వింటాళ్ల బియ్యాన్ని రవి అందించారు. వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన రవిని ఎమ్మెల్యే అభినందించారు. అదే విధంగా దాతలు అందరూ ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకునేందుకు తగు సహకారం అందించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్