పరెడ్ల సత్యనారాయణ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు

1187చూసినవారు
పరెడ్ల సత్యనారాయణ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు
సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, దివంగత నాయకుడు కీర్తిశేషులు పరేడ్ల సత్యనారాయణ రెడ్డి పెద్దకర్మ గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేచర్ల గ్రామంలో నిర్వహించడం జరిగినది. అనంతరం చిత్రపటానికి సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, AICC సభ్యులు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఫోన్ లో సంతాప సందేశం తెలియజేయడం జరిగినది. సత్యనారాయణ రెడ్డి లేని లోటు. మండల కాంగ్రెస్ పార్టీకి మరియు రేజర్ల గ్రామ ప్రజలకు తీరనిలోటని, పరెడ్లలో సత్యనారాయణ రెడ్డి అకాల మరణం జీర్ణించుకోలేనిది అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం కుటుంబ సబ్యులతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చి వారికి మనోధైర్యం ఇవ్వడం జరిగింది,

సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే నాడు సత్యనారాయణ రెడ్డి గారి పెద్దకర్మ ఒకే రోజు రావడం మాకు చాలా బాధాకరమైన విషయం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ గారి నాయకత్వం మమ్మల్నందరినీ ఒక టీంగా ఏర్పాటుచేసి, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో మా మిత్రుడు పరెడ్ల సత్యనారాయణ రెడ్డి ని కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం ఈ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే రోజున*ఈ విధంగా మా మిత్రుడు కోల్పోవడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నామని అన్నారు.
అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివ వేణు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోళ్ళ అప్పారావు, కల్లూరు మరియు పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద బోయిన దుర్గా ప్రసాదు, చెలికాని రాజబాబు, నియోజకవర్గ stసెల్ అధ్యక్షులు హలావత్ వెంకటేశ్వరరావు, దేశి రెడ్డి సత్యనారాయణ రెడ్డి, జనార్ధన్, రేజర్ల సర్పంచ్ జక్కుల ప్రభాకర్, రేజర్ల మాజీ సర్పంచ్ దేశ రెడ్డి దామోదర్ రెడ్డి, నాయకులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పుచ్చకాయల కృష్ణ కుమారి, మెచ్చా రామకృష్ణ, పరెడ్ల అప్పి రెడ్డి, తడకమళ్ళ రాంబాబు, సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మొదలగు మండలాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్