నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి- కాంగ్రెస్

290చూసినవారు
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి- కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు తీవ్ర నష్టదాయకం అని వేంసూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మందలపు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గత 10 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పంజాబ్, హర్యానా రైతులు కొనసాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఆదివారం సాయంత్రం కందుకూరు బోసుబొమ్మ సెంటర్లలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ము కాస్తూ, ప్రజల ఆస్తులైన ప్రభుత్వ సంస్థలు యల్ ఐ సి,బి యస్ ఎన్ యల్,ఇండియన్ రైల్వే, రక్షణ రంగం వంటి అనేక సంస్థలను ప్రవేట్ పరం చేస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ, రైతులకు నష్టం చేస్తూ , భారత వ్యవసాయ రంగాన్ని పెను సంక్షోభంలోకి నెట్టివేసే నూతన చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న పోరాటానికి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు సైతం మద్దతుగా మాట్లాడారని,రైతుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించేందుకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని,వారికి ఆటంకం కలిగించే చర్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మేకల.పుల్లారావు, రాజేంద్రప్ర తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్