తల్లాడ మండలంలోని కుర్నవల్లి ఫీడర్లో మరమ్మతుల దృష్ట్యా కుర్నవల్లి, మిట్టపల్లి సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11: 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ఏఈ సుందర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కుర్నవల్లి, మిట్టపల్లి సబ్ స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.