కల్లూరు మండలంలో సాగర్ జలాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పంట సాగు కోసం సాగర్ జలాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ జడ్పీటిసి కట్టా అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సాగర్ నీరు విడుదల కాకపోవడం వల్ల ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. అనంతరం అధికారులకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.