ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పాలేరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు రామసహయం జయంత్ రెడ్డి ఇటీవల కన్నుమూశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎండి.హపీజుద్దీన్, దాసరి వెంకన్న, పాలేరు ఎంపీటీసీ లచయ్య, పెండ్రా అంజయ్య, యడవెళ్లి రాంరెడ్డి, చెన్నూ వెంకటరమణ, బండారు శ్రీను, లింగేశ్వర్, బిష్మ తదితరులు పాల్గొన్నారు.