ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన అభ్యుదయ సేవా సమితి కమిటీ సభ్యులు ఆదివారం వైరా మండలంలోని గన్నవరం గ్రామంలో అవ్వకు అన్నం పెడదాం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభాగ్యులకు, నిరుపేదలకు, అనాధ వృద్ధులకు అవ్వకు అన్నం పెడదాం అనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, బహుజన అభ్యుదయ సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.