టి.యస్.యు.టి.యఫ్.రాష్ట్ర, జిల్లా కమిటీలకు వేంసూర్ నేతలు ఎన్నిక

342చూసినవారు
టి.యస్.యు.టి.యఫ్.రాష్ట్ర, జిల్లా కమిటీలకు వేంసూర్ నేతలు ఎన్నిక
వేంసూర్: టియస్ యుటియఫ్ నాల్గవ ఖమ్మం జిల్లా మహాసభలు ఆదివారం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య పట్ల పాలకపక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి ఉపాధ్యాయ లోకం తల్లిదండ్రులతో కలిసి ఉద్యమించాలని కోరారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ బదిలీలు పదోన్నతులు లేక ఉపాద్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కార్యక్రమ అనంతరం ఖమ్మం జిల్లా నూతన కమిటీ మరియు రాష్ట్ర ప్రతినిధులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా జి.నాగమల్లేశ్వరరావు ,పి.నాగేశ్వరరావు ఎన్నిక కాగా వేంసూర్ మండలం నుండి రాష్ట్ర ప్రతినిధులు గా కోలేటి.నిర్మల కుమారి,జిల్లాకార్యదర్శి గా జి యస్ ఆర్ .రమేష్ ఎన్నిక పట్ల వేంసూర్ మండల శాఖ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రతినిధులు గా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేకల ధర్మారావు బి.ఈశ్వరాచారి నాయకులు ఎన్. మారేశ్వర రావు,జి.చంద్రశేఖర్ విశ్రాంతి ఉపాధ్యాయులు దోసపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్