వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోదరుడు వాల్య గురువారం అకస్మాత్తుగా మరణించడంతో ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భీముడు నాయక్ వాల్య మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం వైరా ఎమ్మెల్యేను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.