వైరా నియోజకవర్గం, సింగరేణి మండలం, భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన గుగులోత్ లక్ష్మణ్ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిఎం ఆఫీస్ నందు ఎం వి టి సి మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి మండల కాంగ్రెస్ నాయకులు కొత్తగూడెంలో గురువారం ఆయనను కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి , శుభాకాంక్షలు తెలిపారు. మేదరి టోనీ, పెద్దబోయిన ఉమాశంకర్, ధారావత్ వినోద్, మర్శకట్ల రోశయ్య, పాల్గొన్నారు.