కాంగ్రెస్ పార్టీ నుండి ఇల్లందు ఎమ్మెల్యేగా పోటీకి సిద్దం: పోరిక సాయి శంకర్ నాయక్

2253చూసినవారు
కాంగ్రెస్ పార్టీ నుండి ఇల్లందు ఎమ్మెల్యేగా పోటీకి సిద్దం: పోరిక సాయి శంకర్ నాయక్
ఇల్లందు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోరిక సాయి శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మతాలను రెచ్చగొట్టే పార్టీ, టిఆర్ఎస్ పార్టీ యువతను రెచ్చగొట్టి వారి జీవితాలను నాశనం చేయడానికి వచ్చిన పార్టీలుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తీరును తీవ్రంగా ఖండిచారు. ఇవాళ యువతకు ఉద్యగాల కోసం వారి భవిష్యత్ తరాల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. యువత కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం, రైతన్న, యువతకు అండగా ఉండే పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో యువతకు కాంగ్రెస్ పెద్ద పీఠం వేసిందన్నారు. దానికి ఉదాహరణ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయ్యాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములకు లెక్క చేయకుండా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని అవకాశం కల్పించారని చెప్పారు. అదేకాకుండా నేడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునివ్వడం సిగ్గుచేటు అని సాయి శంకర్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లందు గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్