వైరా నియోజకవర్గం సింగరేణి మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ కుటుంబానికి జిల్లా మైనార్టీ అధ్యక్షులు, మాజీ వార్డు సభ్యులు గౌసుద్దీన్ చేయూతనందించారు. యాకూబ్ పాషా కూతురు కరీమా వివాహ సందర్భంగా బుధవారం పెళ్లి కానుకగా 11 వేల రూపాయల విలువైన డ్రెస్సింగ్ టేబుల్, రైస్ కుక్కర్, దివాన్ కాట్ కుర్చీలు కానుకగా అందించారు. ఈ సందర్భంగా గౌసుద్దీన్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.