రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా రూ. 500 బోనస్ అందించి సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్ తెలిపారు. గురువారం వైరాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి ప్రశ్నార్థకమైందన్నారు.