గోర్ బంజారా పోరాట సమితి మండల అధ్యక్షుడిగా శివ నాయక్
ఏన్కూరు మండల గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షుడిగా భూక్య శివ నాయక్ ను జిల్లా అధ్యక్షుడు బానోతు దుర్గాప్రసాద్ నాయక్ నియమించారు. ఈ మేరకు మంగళవారం శివ నాయక్ కు నియామక పత్రాన్ని ఆయన అందజేశారు. తన మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని శివ నాయక్ అన్నారు. అదేవిధంగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.