బిల్లు కట్టలేదని మృతదేహం అప్పగించని ఆసుపత్రి

71చూసినవారు
బిల్లు కట్టలేదని మృతదేహం అప్పగించని ఆసుపత్రి
బిల్లు చెల్లించకపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది మృతదేహం అప్పగించలేదు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నగదాని మాధురి(27) ఐటీ ఉద్యోగిని. ఆమె మే 6న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోరూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. క్షయ వ్యాధి బాగా ముదిరిపోవడంతో ఆమె బుధవారం మృతి చెందింది. చికిత్స నిమిత్తం సుమారు రూ.20 లక్షలు ఖర్చు కాగా.. ఇంకా రూ.7.50 లక్షల వరకు బిల్లు చెల్లించాల్సి ఉండటంతో మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది అప్పగించలేదని మాధురి తండ్రి రాజశేఖర్ వాపోయారు. మృతదేహం తీసుకెళ్లడానికి దాతలు సాయం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్