EV బ్యాటరీ తయారీలోకి కైనెటిక్

55చూసినవారు
EV బ్యాటరీ తయారీలోకి కైనెటిక్
ఆటోమోటివ్ విడిభాగాల రంగంలో ఉన్న కైనెటిక్ గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీ రంగంలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రూ.50 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఫెసిలిటీలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల కోసం 60,000 రేంజ్-ఎక్స్ బ్రాండ్ బ్యాటరీలను తయారు చేస్తారు. లిథియం-అయాన్ ఫాస్పేట్, నికెల్ మాంగనీస్, కోబాల్ట్ రకం బ్యాటరీలు కూడా ఉత్పత్తి అవుతాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్