నూతన సంవత్సర వేడుకలను ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండి పోలీసులు, వివిధ రంగాలకు చెందిన అధికారులు, ప్రజలు, మీడియా ప్రతినిధులు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ముందుగా డీఎస్పీ, అదనపు ఎస్పీలతో కల్సి కేక్ కట్ చేశారు. అలాగే ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలిగించే రీతిలో పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.