నాటుసారా రవాణా చేస్తున్న వాహనాలు జప్తు

80చూసినవారు
నాటుసారా రవాణా చేస్తున్న వాహనాలు జప్తు
రెబ్బెన మండలంలోని ఖైర్గూడా గ్రామంలో నాటు సారా రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు బుధవారం ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రెండు ద్విచక్ర వాహనాలలో 20 లీటర్ల నాటుసారా రవాణా చేస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎక్సైజ్, ఇన్సూరెన్స్ అధికారి దీపక్ తెలిపారు. నాటు సారాను స్వాధీనపర్చుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఐ రమేశ్, సిబ్బంది హెచ్సి సీ. లక్ష్మన్, డీ. సురేష్, సీహెచ్. ధను పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్