దివ్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

361చూసినవారు
దివ్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ
వృద్ధులకు ప్రతీ ఒక్కరు అండగా నిల బడి వారికి తోడ్పాటును అందించాలని దివ్యశ్రీ ఫౌండేషన్ సామాజిక సేవకులు ఝార్పూల శివాజీ కోరారు. గురువారం ఆసిఫాబాద్ నియోజకవర్గం రెబ్బెనా మండలంలోని గోలేటి టౌన్షిప్ లోని వృద్దాశ్రమంలో దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ వారి సహకారంతో రెబ్బెనా మండలం దివ్యశ్రీ ఫౌండేషన్ సామాజిక సేవకుల ఆధ్వర్యంలో అన్నదానంతో పాటుగా 10 కిలోల బియ్యం, బ్రేడ్ ప్యాకెట్, 2 కేజీ పప్పు, 2 లీటర్ల మంచి నూనె, 30 గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు ఫలాలు, బాదాం జ్యూస్ వంటివి పంపిణి చేయటం జరిగింది.

ఈ సందర్భంగా ఝార్పూల శివాజీ మాట్లాడుతూ....వృద్ధులకు సేవ చేయడమంటే భగవంతుడికి సేవచేయడమేనన్నారు. వృద్ధాప్యం శాపంగా మారకూడదన్నారు. వ్యర్ధులను గౌరవించడం, ప్రేమించడం మన సంస్కారానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ధరావత్ రవీందర్, జర్పుల శివాజీ, బానోత్ అరవింద్, బానోత్ వినోద్, రాథోడ్ సచిన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్