వాంకిడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, యువజన యూత్ అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బృందం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికావని, తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోండని మహిళల పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.