బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

1053చూసినవారు
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామంలో మైనర్ అమ్మాయికి వివాహం నిర్ణయించిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు మంగళవారం కొండపల్లి గ్రామానికి చేరుకున్నారు. మైనర్లకు వివాహం చేయడం ద్వారా ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా డిసిపిఓ బుర్ల మహేష్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ‌అన్నారు.

సంబంధిత పోస్ట్