కొమురం భీం జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ ఆదేశాల మేరకు తిర్యాణి మండలంలోని చింతలమాదర జలపాతం సందర్శనకు వచ్చే పర్యటకులు ఎవరూ కంచెను దాటి లోనికి వెళ్లవద్దని గిన్నెధరి డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ కుమార్, టూరిజం కమిటీ సభ్యుడు గోపాల్ ఆదివారం తెలిపారు. లింగాపూర్ మండల కేంద్రంలోని సప్తగుండాల జలపాతం సందర్శన తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సందర్శకులు టూరిజం, అటవీశాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.