నూతన మండల అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ నియమక పత్రాలు అందించారు. కాగజ్ నగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, బుధవారం నూతన బెజ్జుర్ మండల అధ్యక్షులుగా జాడి తిరుపతిని పార్టీ కండువా కప్పి నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని, శ్రీశైలం మాజీ మండల అధ్యక్షుడు జాడి దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.