ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నందు 2 లక్షల 20 వేల రూపాయల విలువ చేసే నిషేధిత పొగాకును వాంకిడి పోలీసులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. వాంకిడి ఏఎస్ఐ పోశెట్టి వివరాల ప్రకారం. వాంకిడి మండల కేంద్రం నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులను కారులో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన పోగాకు విలువ రూ. 2, 20, 240 ఉంటుందని, ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు.