గత నెల 29 న వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ తో సోమవారం రాత్రి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థిని మృతి చెందడం చాలా బాధాకరం అని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు జిల్లా విద్యార్థి యువజన సంఘాలు పిలుపునివ్వడం జరిగింది.