వాంకిడి మండల కేంద్రంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలలో గత నెల 29న ఫుడ్ పాయిజన్ వలన విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ విద్యార్థిని పరిస్థితి నేటికి విషమంగా ఉందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ ఆదివారం అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిదందన్నారు. అయితే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వారె తెలిపారు.