కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం అర్లి గ్రామంలో చేతిపంపు బోరింగ్ పాడైపోయిందని గ్రామస్తులు, గ్రామ మాజీ వార్డు మెంబర్ పురుషోత్తం సంబంధిత నౌదరి పంచాయతీ కార్యదర్శి మహేష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా పాడైపోయిన గ్రామ చేతిపంపు బోరింగ్ కి మరమ్మతు పనులను బుధవారం చేపట్టిన కార్యదర్శి మహేష్ సమస్యను పరిష్కరించాలని కోరినారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి స్పందించారని ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.