Feb 28, 2025, 04:02 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఇంద్రవెల్లిలో ఐదుగురు పీహెచ్‌సీ వైద్యులకు షాక్
Feb 28, 2025, 04:02 IST
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖాన వైద్యుడితో పాటు నలుగురు వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం ఇంద్రవెల్లి పీహెచ్ సీని కలెక్టర్ , ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ వైద్యుడు శ్రీకాంత్ తోపాటు సీహెచ్ వో సందీప్, పీహెచ్ఎన్ జ్యోతి, హెల్త్ సూపర్ వైజర్ సురేష్, ఎంఎల్ హెచ్ పీ పూజ ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజర్ కావడంతో ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.