ఫ్రూట్ జ్యూస్ దుకాణం ధ్వంసం కేసులో 14 మందికి రిమాండ్
ఫ్రూట్ జ్యూస్ దుకాణం ధ్వంసం కేసులో 14 మందిని రిమాండ్ కు తరలించినట్లు కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్‌లోని ఈఎస్ఐ వద్ద, మేయిన్ మార్కెట్ ఫ్లైఓవర్ సమీపంలోని జ్యూస్ సెంటర్ ను ధ్వంసం చేసిన 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్‌నగర్ డీఎస్పీ వెల్లడించారు. ఈ గొడవలో పాల్గొన్న మరికొంత మందిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.