చింతలమానేపల్లి మండలం శివపల్లి(గూడెం) గ్రామంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసీలు ప్రత్యేకంగా జరుపుకునే ఈ బోనాల పండుగ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క సోమవారం ముఖ్య అతిథిగా హాజరై స్వయంభు శ్రీ శంభు మహాదేవ్ గోటుల్ సమితి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు.