చింతల మానేపల్లి మండలం డబ్బా బారెగూడ గ్రామానికి చెందిన ఎస్ఆర్ఎస్ యూత్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గొర్లే శ్రీనివాస్ ఇటీవల జాతీయ మహాత్మ జ్యోతిబాపూలే అవార్డులు పొందారు. బుధవారం బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తుండాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా రామ్ ప్రసాద్, ఎంఎ సలీం, తదితరులు పాల్గొన్నారు.