కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన 57 కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేయనున్నారు. లబ్దిదారులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, రెవెన్యూ స్టాప్తో ఉదయం 9: 30 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో హాజరు కావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.